President Message

 

tn_anjaiah

అందరికీ నమస్కారం

సుధీర్ఘమైన చరిత్ర కలగిన తానాకు నన్న అధ్యక్షునిగా ఎన్నుకొని అమోరికాలోనే కాకుండా భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోని తెలుగు వారకి సేవచేసే అదృష్టం కలిగించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకం గా నమస్కరిస్తున్నాను. ప్రపంచంలో ఉన్నత శ్రేణికి చెందిన లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్ధ ల్లో తానా ఒకటి . అమెరికాలో తెలుగు వారి ప్రాతినిధ్య సంస్థగా తానా స్థిర కీర్తిని సంపాయించుకుంది. మానవీయమైన కార్యక్రమాలు అనేకం చేస్తూ మన్నన పొందింది. సముద్రాలు దాటి వచ్చినా తెలుగు సంస్కృతిని చేజారి పోకుండా తానా పరిరక్షించుకుంటూ వస్తున్నది.

ఈ సంస్థకు మరింత బృహత్తర కార్య క్రమలతో, విశ్వ వ్యాప్తంగా విరాజమానం చేయ్యాలని, మా బృంద మంతా ఉత్సాహపడుతున్నాం. కుల మత వర్గ ప్రాంతీయ విభేదాలు, వైషమ్యాలు లే కుండా ప్రజాస్వామ్య విధానంలో సేవా కార్యక్రమాల్ని చేపట్టబోతున్నాం. సర్వజనులకు ఆమో దయోగ్యమైన, సాంస్కృతిక, సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం.
నన్నయ్య, తిక్కన్న, పోతన , శ్రీనాథుడు, పాల్కురికి సోమనాధుడు వంటి మహాకవులు, సృష్టించిన సాహిత్య సంపదకు, సిద్దేంద్రస్వామి జాతికి అందించిన కూచిపూడి నాట్యానికి, త్యాగ రాజు, నారాయణ తీర్థులు, క్షేత్రయ్య, అన్నమయ్య రామదాసు వంటి మహామహులు మనకు ప్రసాదించిన అద్బుత సంగీత వారసత్వానికి మనం వారసులం. శిల్ప, చిత్ర కళలు క్రీస్తు పూర్వమే తెలుగు నేలను తరింపచేసాయి. జైన భౌద్ద ధార్మిక దృష్టితో తెలుగు వాడి భావ చైతన్యం ఏనాడో మూఢ త్వం నుండి విముక్తమైంది. ధార్మికత కలిగిన నాయుకుల పాలనతో ఆధునిక, శాస్త్ర సాంకేతిక విద్యలు తెలుగు గడ్డ పైన సమృద్ధమై, వేలది మంది యువ శాస్త్ర వేత్తలుగా, సాంకేతిక నిపుణులుగా ఖండాతరాలు దాటి తెలుగు వాణి వినిపిస్తున్నారు. ప్రపంచ సంస్థలకు తెలుగు దిగ్గజాలు నాయకత్వం వహిస్తున్నారు.

ఇంతటి ఘన చరిత్రను, సృష్టించబోతున్న మరింత విశిష్ట భవిష్యత్తుకు ‘తానా’ సాంస్కృతిక చైతన్య విప్లవానికి వేదికగా, వారథి గా నిలవాలి. ప్రాచీన, ఆధునిక భావజాలాలకు సమన్వయకర్తగా పని చేయాలి.
అదే మా లక్ష్యం. అదే మా నూతన బృందం ముందున్న ఉన్నత గమ్యం.
తెలుగు వారికి ఏ ఆపద, అవసరం వచ్చినా ఆపన్న హస్తంగా మారి తెలుగు వాడి గుండే చప్పుడుగా పనిచేస్తుంది. TEAM SQUARE ఏ ఆపదల్లో ఆప్తనిగా, విపత్తుల్లో మిత్రునిగా మారుమూల ప్రాంతాల్లో కూడా దాని సేవలు క్షణాల్లో చేరే విధంగా విస్తరించబోతున్నాం.
బాలల మనోవికాసానికి, యువతలోని ఉత్సహానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని సంకల్పించాం. ఈ దిశగా క్రీడోత్రవాలు, నాట్యోత్సవాలు, సృజనాత్మకతను పెంచే మేధోపరమైన కార్యక్రమాలు, పోటీలు ముమ్మరంగా జరపాలని నిర్ణయించాం. వ్యక్తిత్వవికాసంతో పాటు ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి, సామాజిక స్పృహ మనల్ని ఇంతవారిగా చేసిన సమాజానికి తిరిగి ఇవ్వాలనే (Pay back to society ) అనే భావన రేకెత్తించే కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తాం. అమెరికా వంటి అత్యధునిక అగ్రరాజ్యంలో ఉన్నప్పటకీ ప్రతి తెలుగు వారిలోని, వారి వారసుల లోను తెలుగు సాంకృతిక, చైతన్య దీప్తి ప్రస్ఫుటమయ్యే విధంగా, మన మూలాలు మర్చిపోకుండా జాగ్రత్త పరుస్తామని మాట ఇస్తున్నాను.

ఏ సంస్థకైనా సభ్యులే పునాది రాళ్ళు. వారు లేకుండా ఆ సంస్థ నిర్మాణం, లక్ష్యనిర్దేశం, ప్రణాళిక, కార్యాచరణ ఏ ఒక్కటీ జరగదు. సభత్వ కార్యక్రమం ముమ్మరంగా చేస్తూ, వారిలోని ప్రతిభ కలిగిన వారిని గుర్తించి సత్కరించడం జరుగుతుంది. వారిని సంస్థలో మరింత మమేకం చేయడం కోసం, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాం.
Education is the most powerful weapon which you can use to change the world - అని అంటారు నెల్సన్ మండేలా గారు. శాస్త్ర, సాంకేతిక విషయాలతోపాటు ‘Italian of the East’ అని కీర్తించబడి, ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కీర్తించ బడిన తెలుగు భాషలోని మార్దవం , శబ్ద సౌందర్యం, అక్షర రమ్యత, అలంకారిక శోభ, మన పిల్లలకు, భవిషత్తుతరాలకు అందిచండం తానా కు ఒక గురుతర బాధ్యతగా గుర్తించి, ఆ లక్ష్య సాధనకు మనస్ఫూర్తిగా అంకితమౌతామని ప్రకటిస్తున్నాను.
తానా 5K రన్స్ నిర్వహణ ,స్కాలర్ షిప్పులు పంపిణి, కంటి పరీక్షలు, కేన్సర్, షుగర్, బి.పి వంటి గుర్తింపు పరీక్షలు, ఇతర వ్యాధులు గుర్తించడానికి అవసరమైన ఆరోగ్య శిబిరాల నిర్వహణ పూర్వం కన్నా రాశి లోనూ, వాసిలోను ఉన్నతంగా ఉండేటట్టు నిర్వహిస్తామని మాట ఇస్తూ న్నాను. అలాగే అనాథ సేవా కర్యక్రమాలు, వారధి, గ్రంధాలయాల అభివృద్ధి, డిజిటల్ క్లాసు రూముల నిర్మాణ ఇంకా ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలకు తానా ఫౌండేషన్ ఒక ఛత్రంగా నిలుస్తుందని హృదయపూర్వకంగా హామి ఇస్తున్నాను.

తానా గత కొన్ని సంవత్సరాలుగా ‘ప్రాణరక్షక’ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తోంది. TANA CARES ఆకార్యక్రమాలకు వేదికగా పనిచేస్తోంది. తానా క్యూరీ, తానా బ్యాక్ ప్యాక్, బ్లడ్ మారో డ్రైల్స్, బ్లడేర్రైల్స్, వుడ్ అండ్ హయ్ డ్రైన్స్, CPR కార్యక్రమాలు, ట్రైనింగ్ వర్క్ షాపులు, హెల్త్ మే టర్స్ మీద సెమినార్లు, కాలేజీ ప్లానింగ్ మీద, ఫైనాన్సియల్ మిటర్స్ మీద సెమినార్లు వెబినార్లు నిర్వహించి సభ్యులకు ఆయ విషయాలపై అవగాహన కల్పిస్తాం . రెండు తెలుగు రాష్ట్రాలకు వ్యవసాయం ముఖ్య జీవనోపాధి. రైతులక్షేమమే రాష్ట్ర క్షేమమని భావించే ప్రజా ప్రభుత్వాలు వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. TANA ఆధ్వర్యంలో రైతుల అభివృద్ధి కొరకు నూతన కార్యక్రమాలు రూపోందించి అమలుచేయాలని మా సంకల్పం. SAT, ACT కోచింగ్ పెట్టించడం సంగీతం, జానపద కళలపై అవగాహన, అభినివేశం కోసం, సెమినార్లు వర్కుషాపుల నిర్వహణ చేపడతాం. తెలుగు సాహిత్యం, సాంస్కృతిక కళల అభివృద్ధికి, ప్రపంచ సాహిత్య వేదిక, తెలుగ సాంస్కృతిక సిరులు వంటి కార్యక్రమాల్ని ఇంకా ముకమ్మరంగా నిర్వహిస్తాం. తెలుగు భాష ప్రాచీన విశిష్ట భాష గా గుర్తింపు పోందింది. మరో ప్రక్క మాతృభాషపై నున్న ఏమరు పాటు వలన, దాని ఉనిక ప్రమాదంలో పడే హెచ్చరికలు వింటున్నాం. ఈ ముప్పు తప్పించడానికి ఆధునిక శాస్త్ర శాంకేతిక పదజాలం, వ్యవహారిక పద సంపద, వివిధ మండలికాల పునరుద్దరణ వంటి కార్యకరమాలు చేపట్టే సంస్థలను, వ్యక్తులను ప్రోత్సహిస్తాం. అమెరికా లోని తెలుగు బాల బాలికలు తెలుగు భాష వారి దైనందిన జీవితంలో ఉపయొగ పడే విధంగా ప్రణాళికలు రూపోందిస్తాం. తెలుగు తోజో మూర్తుల జీవిత విశేషాలను వారికి తెలియ వచ్చే విధంగా కార్యక్రమాలు రూపోందిస్తాం. ఇంటా బయటా తెలుగు భాషాకు విశేషమైన సేవలందిస్తున్న ప్రముఖులను గుర్తించి వారిని సన్మానించి, సత్కరిస్తాం. వారి కృషి ని తానా ద్వారా ప్రచురిస్తాం. అమెరికాలోని తెలుగు యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగు పర్చడంతో పాటు, అందుకు అవసరమైయ్యే శిక్షణా కర్యక్రమాల్ని రూపోందిస్తాం. వారికోసం యూత్ ఫెస్టివల్స్ నిర్వహించి తెలుగు భాషా సంస్కృతులపట్ల చక్కని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. కోవిడ్-2019 సమయంలో తానా రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన సేవలందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగారెడ్ క్రాస్ మెరిట్ అవార్డు పోందిన విషయం మీకు గుర్తచేస్తూ, అటువంటి విపత్కార పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తానా మెడికల్ ఫోరమ్ ఏర్పాటు చేస్తాం. ఇమ్మిగ్రేషన్ ఫోరమ్ ప్రారంభిస్తాం.

జనాభా లో సగం ఉండే మహిళల కోసం వివిధ కార్యక్రమాల్ని అమలు చేయల్సిన అవసరముంది. మహిళా వాణిజ్య వేత్తల్ని తయారు చేయడానికి శిక్షణా కర్యక్రమాలు, సెమినార్లు, నిర్వహిస్తాం. గృహహింస కేసుల్లో మహిళలకు అవసరమైన మద్దతు, పునరావాస సౌకర్యాల లభ్యత పై సమాచారం సుళువుగా ల భించేటట్టు ఏర్పాటు చేస్తాం.
ఏ సంస్థకైనా సభ్యుల సంక్షేమే ప్రధానం . వారే సంస్థకు పునాది. సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృత పరచి వారిలో ప్రతిభ కలిగిన వారిని తగు విధంగా ప్రోత్సహిస్తాం. సభ్యల కొరకు ప్రత్యేకంగా విజ్ఞాన, వినోద కార్యక్రమాలు రూపోందించి అమలు చేస్తాం.

ఒక సంస్థ విజయానికి, పూర్వకాల అనుభవం , ప్రస్తుత కార్యచరణలమద్య సమన్వయం చాలా అవసరం. అందుకే పూర్వ ప్రెసెడెంట్లు సూచనలు, సలహాలు స్వీకరిస్తూ TANA ఎగ్జిక్యుటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరక్టర్లు, మరియు ఫౌండేషన్ తో చక్కని సమన్వయాన్ని సాధిస్తూ తానాను ముందుకు తీసుకువెళ్తాం. కార్యవర్గ సభ్యులతో క్రమం తప్పకుండా సమాలోచనలు జరిపి ప్రజాస్వామ్యబద్దంగా తానా ను నిర్వహిస్తాం.
అమెరికాలోను, ఇతర దేశాల్లో తెలుగు భషా సంస్కృతుల పరిరక్షణకు కృషి చేస్తున్న అనేకమైన సంస్థలున్నాయి. అవన్నీ తానా సోదర సంస్థలుగా భావిస్తూ, వారందరితో సోదరభావంతో సామరస్యంగా పనిచేస్తామని తెలియ జేస్తున్నాం. ‘తన’ అంటే ఒక్కడిది. ‘తానా’ అంటే అందరిది అనే భావన ప్రపంచ తెలుగు ప్రజల్లో నెలకొల్పడానికి సాయశక్తుల శ్రమిస్తాం.
ఒక భవనాన్ని నిలపడంలో అన్ని స్థంభాలకు సమాన బాద్యత ఉంటుంది. ఒక వృక్షం పైకి ఎదగడానికి అన్ని వ్రేళ్ళు సమాన పాత్రపోషిస్తాయి. అలాగే ఒక సంస్థ విజయవంతంగా పని చేయడంలో ఒక సభ్యుడి నుండి ప్రెసెడెంటు వరకు వారికిచ్చిన పాత్రకు సమాన న్యాయం చేయాలి.

President is the first among Equals. మనది ఉమ్మడి గమ్యం. మనది సమైక్య లక్ష్యం, మనదృష్టి, సృష్టి, మనకృషి ఐక్యతా భావం .విడిపోతే పడిపోతాం - కలిసుంటే దేనినైన సాధిస్తాం. రాబోయే రెండేళ్ళు, మన శక్తి యుక్తులు, దీక్ష పట్టుదల, ఏకాగ్రత ‘తానా’ కీర్తి పతాక ప్రపంచ వేదిక వేదికపై మరింత సమున్నతంగా, సగర్వంగా ఎగురవేయడానికి కేంద్రీకరిద్దాం.
తానా అధ్యక్షునిగా పనిచేసే అవకాశాన్ని నాతో కలిసి పనిచేయడానికి, సహృదయ కార్య వర్గాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.

‘service is my mission
TANA is my passion

జై తానా! జైజై తానా! జైజైజై తానా!
 

సదా మీ సేవలో

నిరంజన్ శృంగవరపు

PRESIDENT TANA