కథ 2023 ఆవిష్కరణ
తానా సహకారంతో ప్రచురిస్తున్న
కథ 2023 ఆవిష్కరణ
ఈ కధాప్రయాణం కథ 1990తో మొదలైంది. సంపాదకులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్, ముప్పై నాలుగేళ్లుగా నిరాటంకంగా సాగుతోంది.
ఈ కథాసాహితితో తానా ప్రయాణానికి పాతికేళ్లు, 1999 నుంచి తానా ఆర్థిక సహకారంతో ఈ పుస్తకాలన్నీ తక్కువ ధరకు తెలుగు పాఠకులకు అందుతున్నాయి.
34వ సంకలనం కథ 2023 ఖమ్మంలో ఆవిష్కరణ జరిగింది.
అక్టోబర్ 6, 2023 ఆదివారం. ఖమ్మం జిల్లా పరిషత్ హాలు సాహిత్యాభిమానులతో కిటకిటలాడింది. కథ 1990లో మొదలయ్యి ఇప్పటివరకు 34 సంకలనాలు ప్రచురించిన కథాసాహితివారి కథ 2023 ఆవిష్కరణ సభ అది.
ఈ సభ ఖమ్మం జాషువా సాహిత్యవేదిక, ఆధ్వర్యంలో కవి, సాహిత్యాభిమాని, విద్యావేత్త రవిమారుత్ అధ్యక్షతన ప్రారంభమైంది సమాజానికి, కథకి ఉన్న సంబంధాన్ని వివరిస్తూ కథా ప్రయోజనం గురించి రవిమారుత్ మాట్లాడారు.
కథాసాహితి సంస్థని, సంకలనాల ప్రయాణాన్ని కథాసాహితి సంపాదకులు వాసిరెడ్డి నవీన్ వివరిస్తూ, కథల ఎన్నికలో ఎటువంటి వివక్ష, ప్రలోభాలు ఉండవని, కథ మాత్రమే ప్రమాణముని చెప్పు, మంచి కథలు ఎన్నికలో ఉన్న సాధకబాధకాలను గురించి మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా ఈ సంకలనాల ప్రచురణకు తానా అందిస్తున్న ఆర్థిక సహకారానికి, ఈ విషయంలో చొరవ చూపిస్తున్న జంపాల చౌదరిగాకి కృతజ్ఞతలు తెలిపారు.
సమాజంలో వస్తున్న అనేక మార్పులను కథకులు వస్తువులుగా ఎంచుకోవడంతో కథ భవిష్యత్తరాలకు చరిత్ర అవుతుందని కథ 2023 సంకలవాన్ని ఆవిష్కరించిన ఆంధ్రజ్యోతి సంపా దకులు, ప్రముఖ విమర్శకులు కె. శ్రీనివాస్ అన్నారు. కథాసంకలనాల ఎన్నికలో ప్రాంతీయ సమతౌల్యం ఉండాల్సిన ఆవసరం ఉందని అన్నారు. 34 ఏళ్లు గా కథాసాహితితో ప్రయాణం చేస్తున్న ప్రముఖ కవి, ఈ సభకు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన కె.శివారెడ్డి సమాజంలో వస్తున్న మార్పులన్నీ కథకులు తమ కథల్లో ఎప్పటికప్పుడు రికార్డు చేస్తున్నారని, ఒక రకంగా ఈ సంకలనాల ద్వారా చరిత్ర రికార్డు చేయడమేనని అన్నారు.
ఈ సభను ఖమ్మంలో నిర్వహించడంలో ముఖ్యభూమిక వహించిన జాషువా సాహిత్యవేదిక అధ్యక్షులు, ప్రముఖ కవి. సాహితీవేత్త మువ్వా శ్రీనివాసరావు కథాసాహితి ముప్పై నాలుగేళ్ల కృషి గురించి మాట్లాడారు.
రచయిత, ఉపన్యాసకురాలు పి. జ్యోతి కథ 2023ను సమీక్షించారు. సంకలనంలోని 15 కథల సారాంశాన్ని, వాటిలో ప్రత్యేకతలను వివరించారు.
కథాసాహితి మరో సంపాదకులు, ప్రముఖ రచయిత, కవి, విమ్శకుడు పాపినేని శివశంకర్ కథల ఎన్నిక ప్రక్రియ గురించి సవివరంగా మాట్లాడారు. ఈ సంవత్సరం నుంచి సహాయ సంపాదకుడిగా సహకరిస్తున్న ఎ.వి.రమణమూర్తిని సభకు పరిచయం చేసారు. జాషువా సాహిత్యవేదిక కార్యదర్శి పగిడిపల్లి వెంకటేశ్వర్లు సభికులకు, ఆహుతులకు కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ సంకలనంలోని పదిహేను మంది రచయి తల్లో పదకొండుమంది 'రచయితలతో ముఖాముఖి' లో పాల్గొనడం విశేషంగా అందరూ భావించారు. సహాయ సంపాదకుడు ఎ.వి. రమణమూర్తి నిర్వ హణలో రచయితలు కుప్పిలి పద్మ, కత్తి పద్మ, బెజ్జారపు రవీందర్, వేంపల్లె షరీఫ్, స్పూర్తి కందివనం, సుజాత వేల్పూరి, అనిశెట్టి శ్రీధర్, కె.వి. రమణరావు, దేశరాజు, ఛాయ మోహన్ బాబు, పి. శ్రీనివాస్ గౌడ్ తమ కథానేపథ్యాన్ని క్లుప్తంగా వివరించడం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సంకలనంలో అమెరికాలోని తెలుగు రచయితలు అప్సర్. పాణిని జన్నాభట్ల, శివ సోమయాజుల కథలు చోటు చేసుకోవడం విశేషం.