వరద సహాయ కార్యక్రమాల్లో తానా ఫౌండేషన్
తానా ఫౌండేషన్ - అక్షయపాత్ర నిత్యావసర వస్తువుల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), అక్షయపాత్ర సంయుక్తంగా వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసాయి. ఒక్కో కుటుంబానికి 5 కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు, ఒక ఆయిల్ పాకెట్, ఉప్పు, 1/2 కేజీ పుట్నాలపప్పు, 1/2 కేజీ వేరుశెనగ గుళ్లు, 100 గ్రా.ల సాంబార్ పౌడర్, 100 గ్రా. పసుపు, కారం, ఒక కండువా చొప్పున నిత్యా వసర వస్తువులను ప్యాక్ చేసి, అందించారు.
ఎలప్రోలు గ్రామంలో నిత్యావసర వస్తువుల పంపిణి
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు వరద బాధితు లకు అవసరమైన నిత్యావసర వస్తువులను, ఇతర సహాయాన్ని అందించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీం పట్నం మండలంలోని ఎలప్రోలు గ్రామంలో వరద బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. దాదాపు 1645 బాక్స్‌లలో నిత్యావసర వస్తువులను ప్యాక్ చేయించి అందరికీ అందజేశారు.
వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న పారిశుద్ధ్య కార్మికులకు తానా ఫౌండేషన్ సహకారంతో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యవేక్షణలో బిజెపి స్టేట్ మీడియా ఇన్చార్జ్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, నాగేశ్వరరావు, రాజమండ్రి ఎం.పి. దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు
పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ
వెయ్యి దుప్పట్లు, టవల్స్ పంపిణి
విజయవాడ వరదలో చిక్కుకున్న ప్రజలకి సహాయార్థం మంత్రి కొలుసు పార్థసారధి సూచన మేరకు వెయ్యి దుప్పట్లు, వెయ్యి టవల్స్ తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, సెక్రటరీ రాజ కసుకుర్తి, సభ్యులు గోగినేని కార్తీక్ సమకూర్చారు. సుంకోళ్లు గ్రామం ఆధ్వర్యంలో 100 రైస్ బాగ్స్ విజయ వాడ తరలించారు. ఇవి మంత్రి సారధి. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ కృష్ణ లంక ఏరియాలో పంపిణీ చేశారు.
Andhra Flood Relief Activity
TANA Foundation response to flood affected villages in K.Kothapalem, Bobbarlaka, Varpu, Edlalanka etc villages in Krishna district. Distributed groceries to 200 flood affected families. Around Avanigadda. Distributed 200 kits of dry grocery boxes to flood affected people.
Also successfully distributed 10000 packages in Vijayawada surroundings which includes Milk, Water, Bread and Yogurt and distributed 2000 packages containing Rice, Bananas and some vegetables. Distributed 10000 Food boxes/day on September 3rd and 4th in Vijayawada surrounding flood affected areas.
ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు తానా చేయూత
ఇటీవల తుఫాను వరద తాకిడికి గురై నష్టపోయిన ఖమ్మం రూరల్ మండలం ఉన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు తానా ఫౌండేషన్ సభ్యులు చేయూతన అందించారు. పాఠశాలలో చదువుతున్న 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిచి నిత్యావసర సరుకులు, దుప్పట్లను పంపిణీ చేశారు.