slider8-2018

TANA and Community News

తానా టీం స్క్వేర్ - బోస్టన్ పరిసర ప్రాంతాల బృందం ప్రారంభానికి విశేష స్పందన

TEAM-Square-Boston-team-1
గత ఎనిమిది సంవత్సరాలుగా ఉత్తర అమెరికాలో అనుకోని ఆపదల పాలయిన తెలుగు వారికి ఎనలేని సేవలందిస్తూన్న టీమ్ స్క్వేర్ గా పిలువ బడుతున్న తానా   అత్యవసర సహాయక బృందం , ఇప్పుడు మరో కొత్త పంధాలో అందరికీ అందుబాటులోకి రాబోతుంది. 2008 లో తానా మాజీ అధ్యక్షుడు నన్నపనేని మోహన్  ఆలోచనతో మొదలయ్యి నాటినుండి నేటి వరకు విజయంతంగా నడుస్తున్న టీం స్క్వేర్  ఇప్పుడు అమెరికా, కెనడా దేశాల్లో అన్ని ప్రధాన నగరాల్లో స్థానిక బృందాలుగా విస్తరించబోతుంది. ఇప్పటికే దాదాపు నాలుగు వందలకు స్వచ్చంద సేవకులతో ఎదిగి, ఆరు వందలకు పైగా జరిగిన ప్రమాదాల్లో, సంఘటనల్లో వందలాది మంది తెలుగు మరియు ఇతర భారతీయులకు ఆపన్న హస్తాన్ని అందించిన టీం స్క్వేర్ రెట్టించిన ఉత్తేజంతో తన కార్యక్రమాలని విస్తృత పరచే దిశలో సాగుతుంది.

TEAM-Square-Boston-team-2అక్టోబర్ 9న, బోస్టన్ లో  నన్నపనేని మోహన్ అధ్యక్షతన, టీవీ అధినేత శ్రీ రవి ప్రకాష్, హీరో శివాజీ ముఖ్య అతిధులుగా, సుమారు యాభై మంది నిబద్దులైన వాలంటీర్స్ తో సమావేశం అయిన టీం స్క్వేర్ బోస్టన్ పరిసర ప్రాంతాల చాఫ్టర్ ను ఆవిష్కరించింది. తానా ప్రాంతీయ కోర్డినేటర్ శ్రీనివాస్ కొల్లిపర గారు, బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం మాజీ అధ్యక్షుడు శంకర్ మగపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

నన్నపనేని మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక ముందు బోస్టన్ పరిసర ప్రాంతాలలో ఏ ప్రవాస భారతీయులకయినా, ముఖ్యంగా ఏ తెలుగు వారికైనా ఆపదఎదురైతే,  బోస్టన్ టీం స్క్వేర్ లోని ప్రతి ఒక్క కార్యకర్తా ఒక సొంత కుటుంబ సభ్యుడిలా ఆ ఆపద పాలయిన కుటుంబానికి ఆసరాగా వెంటనే స్పందించి ఆసరా అందించేలా ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. 

TANA, TEAM, Square, Help, Line, Telugu, Association, of, north, america, Mohan, nannapaneni, Ravi Prakash, Boston, MA

కష్ట  సమయం  లో అందించే సేవకు ఎటువంటి ప్రచారం, పొగడ్త లభించక పోయినా ఆ సహాయాన్ని అందుకున్న వారి హృదయాల్లో వెలకట్టలేని కృతజ్ఞతా భావం మనకెంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. 

టీం స్క్వేర్ మొదలయినప్పటినుండి ఈరోజు వరకు ఒక్క సంఘటనలో కూడా ఓటమి, నిరాశ లేకపోవటానికి కారణం నిబద్దత కలిగిన వందలాది మంది కార్యకర్తల కృషే మూలం అని ప్రతి ఒక్క వాలంటీర్ కు కృతజ్ఞతలు చెప్పారు.

టీవీ 9 అధినేత, రవి ప్రకాష్ గారు బోస్టన్ లోకల్ చాఫ్టర్ ను ఆవిష్కరించి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, కష్ట సమయంలో సాటి వారిని ఆడుకొని అందులో సంతృప్తి చెందటం చాలా గొప్ప విషయం అన్నారు. మన ఏమి సంపాదించినా చివరకు మనతో తీసుకువెళ్ళలేము కానీ మనం సంపాదించిన మంచితనం మాత్రం మనపేరుతో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. టీం స్క్వేర్ సేవలు ఈనాడు ప్రపంచం లో మానవతా విలువలను మరింత ఉన్నత స్థాయికి చేరుస్తున్నాయని, అందులో మోహన్ కృషి ప్రసంశనీయం అన్నారు.

TEAM-Square-Boston-team-4మిమిక్రీ  రమేష్ తన విన్నూతనమయిన ప్రదర్శనతో నవ్వులు పూయించారు .

ప్రముఖ సినీ హీరో శివాజీ గారు మాట్లాడుతూ సమాజంలో మానవత మరుగవుతున్న ఈరోజుల్లో  సాటి వారి కష్టాల్లో చేయూత అందించే ఒక మంచి పనిని ఎంచుకున్నందుకు ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేసారు.

టీం స్క్వేర్ బోస్టన్ చాప్టర్ స్థాపించిని సందర్భంగా, దాని కార్యక్రమాలకు స్పందించిన శ్రీనివాస్ బోళ్ల వెయ్యి డాలర్ల విరాళాన్ని రవిప్రకాష్ గారి చేతులమీదుగా టీం స్క్వేర్ కు అందించారు.

తెలుగు అస్సోసియేషన్ చైర్మన్ డాక్టర్ ముద్దను హరిబాబు, ప్రెసిడెంట్ చంద్ర  తాళ్లూరి, శశికాంత్ వల్లేపల్లి, ప్రకాష్TEAM-Square-Boston-team-5 రెడ్డి,  శంకర్ మగపు, బాబురావు పోలవరపు, శ్రీనివాస్ కాకి,  కోటేష్ కందుకూరి, శ్రీనివాస్ బచ్చు, మణిమాల,  అమర్ జయం, సురేంద్ర, విజయ్ బెజవాడ, మల్ల రెడ్డి, శివ దోగిపర్తి, పద్మాఅంజలి, మాధవి, మాధురి తదితరులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం తో పాటు బోస్టన్ చాఫ్టర్ కు కార్యాకర్తలుగా చేరారు.

నన్నపనేని మోహన్ అందరికీ కృతఙ్ఞతలు చెపుతూ త్వరలోనే టీం స్క్వేర్ లోకల్ చాఫ్టర్స్ మరో నలభై పట్టణాల్లో మొదలు కాబోతున్నట్లు ప్రకటించారు.