slider8-2018

TANA and Community News

కొలంబస్ ఒహాయో లో పిల్లలకు బ్యాగుల వితరణ

columbus-backpacks-2016-2
ఒహాయో రాష్ట్ర కొలంబస్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో వెస్ట్ ఫ్రాంక్లిన్ ప్రాథమిక పాఠశాలలో పేద విద్యార్థులకు బ్యాగులను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తానా ప్రాంతీ ప్రతినిధి సామినేని రవి, శివ, సుధీర్, శ్రీవర్షిణి, తలశిల వేణు, ఒహాయో తెలుగు సంఘ అధ్యక్షుడు కామినేని అశోక్, కోశాధికారి సుబ్బారెడ్డి, ట్రస్టీ రేవూరు రామచంద్ర తదితరులు పాల్గొని 100మంది విద్యార్థులకు వీటిని అందించారు. ఇప్పటి వరకు 400మంది విద్యార్థులకు బ్యాగులను అందించిన తానా-ఒహాయో విభాగాన్ని అధ్యక్షుడు డా.జంపాల చౌదరి అభినందించారు.
columbus-backpacks-2016-1